తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న 'క్వీన్' వెబ్‌సిరీస్ వివాదంలో ఇరుక్కుంది. దర్శకుడు గౌతమ్ మేనన్.. తన అనుమతి తీసుకోకుండా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారని ఓ ప్రకటన చేశాడు ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్. ఇదే కథాంశంతో ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న 'తలైవి'కి పర్శిషన్ ఇచ్చినట్లు చెప్పాడు.
"అమ్మ(జయలలిత) ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె గురించి అందరికీ తెలుసు. ఆమె జీవితాన్ని రూపొందిస్తామంటే అభ్యంతరం లేదు. కానీ మా నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా బయోపిక్ తీసే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అమ్మ గురించి ఏమైనా వేరుగా చూపిస్తే దావా వేసేందుకు కూడా వెనుకాడను". -దీపక్ జయకుమార్, జయలలిత మేనల్లుడు.
ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్ తొలి సీజన్లో మొత్తం 11 ఎపిసోడ్స్ ఉండనున్నాయి.
ఇదే కాకుండా 'తలైవి' అనే సినిమాను జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. జయ పాత్రలో కనిపించనుంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇది చదవండి: బాలీవుడ్ జేజమ్మగా కరీనా కపూర్..!