ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ', 'బాలు' చిత్రాల్లో తాజ్ మహల్, చార్మినార్ సెట్లు దర్శనమిచ్చాయి. ఇప్పుడు మరోసారి పవన్ కోసం ఈ కట్టడాలు నిర్మితవుతున్నాయని సమాచారం. పవన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. హిందీ 'పింక్' చిత్రానికి రీమేక్ ఇది. పవర్‌స్టార్ రీఎంట్రీ నేపథ్యంలో భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు దర్శకనిర్మాతలు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తాజ్ మహల్, చార్మినార్ సెట్లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రణాళిక పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నారని సమాచారం. వీటితోపాటు కోర్టు సెట్‌ను నిర్మిస్తారని టాక్. గతంలో తాజ్‌మహల్, చార్మినార్ సెట్లు ఉన్న పవన్ చిత్రాలు మంచి విజయం అందుకున్నాయని, మరోసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవీ చూడండి.. అదరగొడుతున్న ‘'వాట్టే బ్యూటీ' సాంగ్