వినోనా రైడర్.. హాలీవుడ్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న నటి.. రెండుసార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన హీరోయిన్. అందంతో పాటు నటిగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంత పాపులర్ అయిన ఆమె దొంగతనం చేస్తూ దొరికిపోయి అబాసుపాలైంది.
వినోనా.. 1971 అక్టోబరు 29న జన్మించింది. చిన్నతనం నుంచి నటి కావాలనే ఆకాంక్షతో హాలీవుడ్లో అడుగుపెట్టింది. లూకాస్, హీదర్స్, బీటిల్ జ్యూస్, లిటిల్ వుమన్, మెర్మెయిడ్స్, ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఏలియన్ రిసరెక్షన్, మిస్టర్ డీడ్స్, స్టార్ ట్రెక్ లాంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
మలుపు తిప్పిన సంఘటన..
2001 డిసెంబరులో అమెరికా బెవెర్లీ హౌస్‌లో ఓ వస్త్ర దుకాణంలో ప్రముఖ డిజనైర్లు రూపొందించిన దుస్తులను దొంగతనం చేస్తూ దొరికిపోయింది వినోనా. 5000 (రూ. 3లక్షల 53వేలు)డాలర్లు విలువ చేసే ఆ బట్టలను చోరీ చేస్తూ అడ్డంగా బుక్కైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇందుకు ప్రతిఫలంగా అప్పటి వరకు ఆమె సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు గంగలో కలిసిపోయాయి. న్యాయస్థానం ఆమెను మూడేళ్ల పాటు అధికారుల పర్యవేక్షణలో ఉండేలా శిక్షించింది. అంతేకాకుండా 480 గంటలపాటు కమ్యునిటీ సెంటర్లో పనిచేయాలని ఆదేశిస్తూ.. 2700 డాలర్లు(చోరీ చేసిన మొత్తం కాకుండా) జరిమానా విధించింది.
అనంతరం వ్యక్తిగత సమస్యలు, కుంగుబాటుకు గురవడం లాంటి ఒడుదుడుకులను ఎదుర్కొంది వినోనా. ఏమైనా ఓ మంచి నటిగా హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫ్రేమ్‌లో స్థానం పొందింది. ప్రముఖ నటుడు జానీ డెప్‌తో సాన్నిహిత్యం ఆమెను తరచు వార్తా కథనాల్లోకి ఎక్కేలా చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: జీవిత పాఠాలు చెబుతోన్న రకుల్ ప్రీత్ సింగ్