మహాభారత ఇతిహాసాన్ని ఇతివృత్తంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. మరోసారి అన్ని హంగులతో భారీ బడ్జెత్తో తెరకెక్కించడానికి పలు ఇండస్ట్రీలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్లో ఇలాంటి కథతో ఓ సినిమా రాబోతుంది.
మహాభారతంలోని ద్రౌపదిని పాత్రను ఆధారం చేసుకుని ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణెతో పాటు ప్రముఖ నిర్మాత మధు మంతెనా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మిస్తూ ద్రౌపది పాత్రలోనూ నటించనుంది దీపిక. పలు భాగాలుగా రానున్న ఈ చిత్ర మొదటి పార్ట్ 2021 దీపావళి కానుకగా విడుదలవనుంది.
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితాధారంగా ఇప్పటికే ఛపాక్ అనే చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తోందీ దీపిక. తాజాగా ద్రౌపదిగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.
ఇవీ చూడండి.. వెంకటేశ్ చిత్రంలో నవాజుద్దీన్..!