బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ముఖ్యపాత్ర పోషించి, నిర్మించిన చిత్రం 'ఛపాక్'. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ వ్యవహారం అంత సాఫీగా సాగేలా కనపడటం లేదు. అపర్ణా భట్ అనే న్యాయవాది చిత్ర విడుదలను ఆపాలంటూ దిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు.
"నేను చాలా సంత్సరాలుగా యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ న్యాయవాదిని. కానీ ఈ సినిమాలో నాకు తగిన గుర్తింపునివ్వలేదు. సినిమా చూశాక నిరాశకు గురయ్యా. ఈ విషయంలో బాలీవుడ్ నిశ్శబ్దంగా ఉండటం విచారకరం. రానున్న పరిణామాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం" -అపర్ణా భట్, న్యాయవాది
ఇటీవలే ఆ సినిమా కథ తనదే అంటూ రాకేష్ భారతి అనే రచయిత బాంబే హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. అయితే, నిజజీవిత ఘటన ఆధారంగా జరిగిన సంఘటనలకు కాపీరైట్ వర్తించదన్న న్యాయస్థానం, ఆ కేసును కొట్టివేయటంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ఈ ఆటంకం నేపథ్యంలో చిత్రం రేపు విడుదల అయ్యేదీ లేనిదీ తెలియాల్సి ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: దర్శకుడు, హీరోయిన్ మాయం.. నష్టం జరిగిందని నిర్మాత ఆవేదన