యువహీరో నిఖిల్ నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది చిత్రబృందం. హీరో నిఖిల్.. సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
"దాదాపు ఏడాదిన్నర పాటు ఎదురైనా కష్టాలు, ఎదురుచూపులకు ఫలితం దక్కింది. సినిమా ఆలస్యంగా బయటకొచ్చినా అదిరిపోయే విజయాన్ని అందించింది. ఈ స్పందన చూసిన నిర్మాతలు.. సీక్వెల్ తీయాలనే ఆలోచన చేస్తున్నారు" -నిఖిల్, సినీ హీరో
ఈ కథానాయకుడి మాటలు వింటోంటే మరో 'అర్జున్ సురవరం' రావడం పక్కా అనే సంకేతాలు వస్తున్నాయి. ఇదెప్పుడు పట్టాలెక్కనుందో? ఎప్పటికి ప్రేక్షకుల ముందుకొస్తుందో?.. తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:యువ వైద్యురాలి ఆత్మ శాంతి కోసం గంగా హారతి