చిత్రసీమను రెండు మెగా సీజన్లు వెంట వెంటనే పలకరించబోతున్నాయి. వీటిలో ఒకటి క్రిస్మస్ , మరొకటి సంక్రాంతి. అయితే ఈ రెండు పండగల్లోనూ సందడంతా పోలీసులు, మేజర్లదే. క్రిస్మస్ బరిలో ఇద్దరు పోలీసు అధికారులు పోటీ పడుతున్నారు. ముగ్గుల పండక్కి ఓ పోలీస్ అధికారి, మరో మేజర్ తుపాకులు ఎత్తబోతున్నారు.
చుల్‌బుల్ పాండేతో పోటీకి ఇన్స్పెక్టర్ ధర్మ
డిసెంబరు 20న బాలకృష్ణ 'రూలర్'గా తుపాకీ తీయబోతున్నారు. అదే రోజు చుల్‌బుల్ పాండేగా రాబోతున్నాడు సల్మాన్. 'దబాంగ్ 3'తో బాక్సాఫీస్ బరిలో దిగనున్నాడు. బాలయ్య.. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం.. కండల వీరుడు మాత్రం అన్ని ప్రాంతీయ భాషలపై దృష్టిపెట్టాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'దబాంగ్-3'ను హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయబోతున్నాడు. మిగతా ప్రాంతాల్లో సల్మాన్‌కు పోటీ పెద్దగా ఉండనప్పటికీ తెలుగులో మాత్రం బాలయ్య క్రేజ్‌ను దాటి ఎలా సత్తా చాటుతాడో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సూపర్‌స్టార్స్ ఇద్దరూ సంక్రాంతి బరిలో
సంక్రాంతికి ఇద్దరు సూపర్‌స్టార్స్ యూనిఫామ్‌లో సందడి చేయబోతున్నారు. 'దర్బార్'లో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా రజనీకాంత్ కనిపించనున్నాడు. మేజర్ అజయ్ కృష్ణగా 'సరిలేరు నీకెవ్వరు'తో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాడు మహేశ్‌బాబు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీరిలో మహేశ్ జనవరి 12న రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రజనీ మాత్రం ఎప్పుడు వస్తాడో తెలియాల్సి ఉంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రజనీ.. జనవరి 10న థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాడట. మరి సంక్రాంతి పోరులో పోలీస్ సత్తా చాటుతాడా? లేక మేజర్ కాలరెగరేస్తాడా? అనేది చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'దర్బార్'కు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు'ను తెరకెక్కిస్తున్నాడు. రజనీకి రెండు భాషల్లోనూ అదిరిపోయే క్రేజ్ ఉండగా.. మహేశ్‌కు మాత్రం తమిళనాట అంతటి క్రేజ్ లేకపోవడం 'సరిలేరు..'కు ఓ ప్రతికూలాంశం.