మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. చిరు కోసం అదిరిపోయే కథను ఈ దర్శకుడు సిద్ధం చేశాడని టాక్. అందుకు తగ్గట్టుగానే ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్'తో ఫామ్‌లోకి వచ్చిన మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటోందీ సినిమా. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రిష హీరోయిన్గా నటించనుందని సమాచారం. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
ఇది చదవండి: జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు.. ఫొటో వైరల్