ప్రముఖ సంగీత దర్శకుడు స్వర వీణాపాణిని మెగాస్టార్ చిరంజీవి అభినందించాడు. తన నివాసంలో ఆయనను సత్కరించాడు చిరు. లండన్ వేదికగా జరిగిన మ్యూజిక్ మారథాన్‌లో వీణాపాణి 61 గంటల పాటు వీణావాదం చేసి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడని తెలిపాడు.
అక్టోబర్ 2న సంగీతంలోని విశిష్టతను ప్రపంచానికి తెలిపే 72 రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాలు వీణావాదం చేశాడు వీణాపాణి. ఈ ఘనతతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించాడు.
తనికెళ్ల భరణి, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు వీణాపాణికి అభినందనలు తెలిపారు. తనికెళ్ల భరణి తెరకెక్కించిన 'మిథునం' సినిమాకు సంగీతం సమకూర్చాడు వీణాపాణి.
ఇదీ చదవండి: తాడేపల్లిగూడెంకు స్టార్ యాక్టర్.. మహిళల పరుగులు