తనదైన శైలిలో హాస్య పాత్రలు పోషించి, వీక్షకులను మెప్పించారు హాస్యనటుడు బ్రహ్మానందం. ఇప్పుడు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే పాత్రలో నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రూపొందిస్తున్న 'రంగమార్తాండ'లో ఇలా కనిపించనున్నారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ.. సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నాడు.
'రంగమార్తాండ'లో దిగ్గజ, పద్మశ్రీ బ్రహ్మానందం నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే పాత్రలో కనిపించనున్నారు' -కృష్ణవంశీ, దర్శకుడు
ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రధారులు. ఇళయరాజా సంగీత దర్శకుడు. మరాఠీలో విజయవంతమైన 'నట సామ్రాట్'కు తెలుగు రీమేక్ ఈ చిత్రం. నటన నుంచి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ విషాదకర జీవితమే కథాంశం. మరాఠీ చిత్రంలో నానాపటేకర్ కీలకపాత్రలో కనిపించి మెప్పించారు.
ఇది చదవండి: కట్‌చేస్తే .. భర్త కృష్ణవంశీ డైరెక్షన్లో రమ్యకృష్ణ