'లుకా చుప్పీ', 'పతి పత్ని ఔర్ వొ' లాంటి చిత్రాలతో మెప్పించిన నటుడు కార్తిక్ ఆర్యన్. ప్రస్తుతం 'భూల్ భులయ్యా2', 'దోస్తానా2' లాంటి చిత్రాలు చేస్తున్నాడు. అయితే జయాపజయాలను పెద్ద పట్టించుకోనని అంటున్నాడు కార్తీక్.
"సినిమా విజయాలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ పట్టించుకోను. వైఫల్యాలు, విజయాలను సమానంగా చూస్తాను. ఏదైనా సరే తాత్కాలికమే. అలా అనుకుని ముందుకు సాగడమే నాకు తెలుసు. కొన్ని కథలు విన్నప్పుడు కచ్చితంగా ఇవి మనం చేయాల్సినవే అనిపిస్తోంది. అలా చేసిన చిత్రాలే 'లుకా చుప్పీ', 'పతి పత్ని ఔర్ వొ'. అంతేకాదు హాలీవుడ్‌లో టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జోకర్’లాంటి చిత్రం చేయాలి. అందులో నటుడు జోక్విన్ ఫీనిక్స్ చేసిన జోకర్ పాత్ర నాకు చాలా ఇష్టం. ఇక 2020 నుంచి మీరు నాలో కొత్త కార్తిక్‌ని చూస్తారు" -కార్తీక్ ఆర్యన్, బాలీవుడ్ హీరో.
కార్తిక్ ఆర్యన్ - సారా అలీఖాన్‌తో కలిసి ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14, 2020న తెరపైకి రానుంది.
ఇదీ చదవండి: 'గత 18 ఏళ్లలో ఐదు రోజులే సెలవు తీసుకున్నా'