'పగ్లీ' చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ 'ఎం.ఎస్.ధోనీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కియారా అడ్వాణీ. 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. తాజాగా ఈ చిన్నది న్యూ ఇయర్ సందర్భంగా షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకుని ఆఫ్రికా టూర్ వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఆఫ్రికాలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు. ఫలితంగా కియారా, సిద్ధార్థ్ కలిసే టూర్‌కు వెళ్లారంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
- View this post on Instagram
Starting the year with soaking up the morning sun ☀ Mother Nature at its best!
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
శుక్రవారం ఆఫ్రికా నుంచి ముంబయికు చేరుకున్న కియారా అడ్వాణీ పక్కనే సిద్ధార్థ్ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో వీరి ప్రేమాయణంపై స్పందించిన ఈ అందాల భామ... అవి వదంతులే అని సమాధానమిచ్చింది.

గతేడాది విడులైన 'కబీర్‌సింగ్', 'గుడ్‌న్యూస్' చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కియారా అడ్వాణీ. ప్రస్తుతం ఆమె 'లక్ష్మిబాంబ్', 'ఇండోకి జనానీ', 'షెర్‌షా' చిత్రాలతో బిజీగా ఉంది.