టాలీవుడ్ సీనియర్ హీరోలు కొత్త లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. నటసింహం నందమూరి బాలకృష్ణ మోడ్రన్ లుక్‌లో గోల్ఫ్ ఆడుతూ కనిపించాడు. మరో కథానాయకుడు వెంకటేశ్.. రెట్రో స్టైల్‌తో అదరగొట్టాడు. ఈ ఫొటోలు.. అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
గోల్ఫ్ ఆడుతున్న 'రూలర్' బాలయ్య
'రూలర్' సినిమాలోని ఈ లుక్‌తో బాలకృష్ణ అలరిస్తున్నాడు. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుపుకుంటోందీ సినిమా. వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాయల్ వెంటపడుతున్న వెంకటేశ్
'వెంకీమామ' సినిమాలో 'ఎన్నాళ్లకో' అంటూ సాగే పాట కోసం రెట్రో స్టైల్లో కనిపించనున్నారు వెంకటేశ్-పాయల్ రాజ్‌పుత్. లిరికల్ పాట శనివారం విడుదల కానుంది. ఇందులో నాగచైతన్య-రాశీఖన్నా మరో జోడీగా నటిస్తున్నారు. త్వరలో విడుదల కానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: 'ఆదిత్య 369'లో కమల్ కుదరదన్నాడు ఎందుకు?