నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘రూలర్’ ఈ డిసెంబరులో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో పనిచేయనున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్ను వెతికే పనిలో ఉంది చిత్రబృందం.
ఈ చిత్రంలో కథానాయికగా కన్నడ భామ రచిత రామ్‌ని ఎంచుకున్నారని ప్రచారం జరిగింది. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. రచితని ఇప్పటివరకూ సంప్రదించలేదని, కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది.
సంగీత దర్శకుడిగా అనిరుధ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు సంజయ్‌దత్‌ని విలన్‌గా ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్, సంజయ్‌దత్ విషయంలో చిత్రబృందం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం.
ఈ చిత్రంలో ఓ బలమైన ప్రతినాయకుడు ఉంటారని, ఆ పాత్రలో ఓ ప్రముఖ కథానాయకుడు కనిపిస్తాడని, ఆయన బాలీవుడ్ నుంచి వస్తారా, లేదంటే తెలుగు నటుడేనా అన్నది ఇంకా ఖరారు కాలేదని చిత్రబృంద సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2020 జనవరి నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: సుధీర్‌బాబు కసరత్తుల వెనుక కారణమిదే..!