పెంపుడు జంతువులకు ముద్దు పేర్లు పెట్టుకుంటారనేది అందరికి తెలిసిందే. సులభంగా గుర్తుంచుకునేందుకు మనకు తెలిసిన చాలా పేర్లు ఉన్నాయి. కానీ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ విచిత్రమైన పేరు పెట్టాడు. తన గుర్రాలకు సినిమా పేరును పెట్టి ఆశ్చర్యపరిచాడు.
స్వతహాగా జంతువులంటే ఇష్టపడే భాయ్.. బజరంగీ భాయ్‌జాన్ చిత్రం విజయం సాధించిన సమయంలో రెండు కొత్త గుర్రాలను కొన్నాడు. ఈ సందర్భంగా ఒక గుర్రానికి బజరంగీ అని, మరోదానికి భాయ్‌జాన్ అని పేర్లు పెట్టాడు.
సల్మాన్ ఇలా విచిత్రమైన పేర్లు పెట్టడం ఇదే మొదటి సారి కాదు. గతంలో తన చిత్రం వీర్ పేరును తనకిష్టమైన కుక్కకు పెట్టుకున్నాడు. అయితే అది రెండేళ్ల క్రితం చనిపోయింది. అనంతరం మరో రెండు కుక్కలను కొని వాటికి మై జాన్, మై సన్ అని పేర్లు పెట్టాడు సల్మాన్.
ఇదీ చదవండి: మరగుజ్జుగానే కాదు.. మహిళగానూ నటిస్తా: రితేష్