స్వీటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'నిశ్శబ్దం'. సంగీతం ప్రధానాంశంగా రూపొందుతోంది. మాధవన్ మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని అంజలి లుక్ను ప్రేక్షకులతో పంచుకుంది చిత్రబృందం. మహా అనే క్రైమ్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనుందీ నటి.
ఈ సినిమాలో మైఖేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఇవీ చూడండి.. 'మార్నింగ్ వాక్ జీవిత పాఠం నేర్పింది'