"రెండు రెళ్లు నాలుగు కాదు ఆరు" అంటున్నారు మెగా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. చిత్ర పరిశ్రమలో ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడం ఉభయతారకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణే అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రమని తెలిపిన అరవింద్.. హారికా హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లాభాన్ని చేకూర్చిందని స్పష్టం చేశారు.
సంక్రాంతి పండక్కి వెళ్లే ప్రజలు కోడి పందాలను ఆస్వాదించినట్లుగానే తమ సినిమాను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అరవింద్. బన్నీ 'రేసుగుర్రం'లో ఒకలా, 'అల వైకుంఠపురములో' మరోలా కనిపించి తనలో ఇన్ని కోణాలున్నాయని ఆశ్చర్యపోయేలా చేశాడని ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి.. కృష్ణమాచారి పాత్రలో జీవా.. లుక్ ఇదిగో