ఒకప్పటి స్టార్ హీరోయిన్, హీరో నాగార్జున సతీమణి అమల.. ఇటీవలే సినిమాల్లోకి పునరాగమనం చేసింది. ఎప్పుడు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ఈ నటి ఇటీవల అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో శర్వాకు తల్లిగా కనిపించనుంది.
తల్లి పాత్రలో కనిపిస్తున్నా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం రాజీపడటం లేదు అమల. శనివారం తన కసరత్తులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 71 కేజీల బరువును ఎత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ రోజు 71 కేజీల బరువు ఎత్తాను. మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు..? బలమైన బాడీ, బలమైన మనసు. అందరూ స్ట్రాంగ్‌గా ఉండండి." అంటూ కామెంట్ చేసింది.
ఇవీ చూడండి.. నిఖిల్ ఫిక్స్ అన్నా.. వెన్నెల నమ్మట్లేదు