'రూలర్'తో బిజీగా ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తర్వాత చిత్రం బోయపాటి శ్రీనుతో చేయనున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలు కానుంది. ఈలోపు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడీ డైరక్టర్. అందుకు తగ్గట్లుగానే నటీనటులు ఎంపిక జరుగుతోందట. ఈ సినిమాలోని ప్రతినాయక లక్షణాలున్న ఓ పాత్ర కోసం ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజాను సంప్రదించారని సమాచారం. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
అయితే వెండితెరపై మాత్రం బాలకృష్ణ-రోజాది తిరుగులేని జోడీ. వీరిద్దరి కాంబినేషన్లో భైరవద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య లాంటి సూపర్‌హిట్ చిత్రాలు వచ్చాయి.
పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ చిత్రంలో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడట. కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్గా నటించనుందట.
ఇది చదవండి: బోయపాటి సినిమా కోసం హీరో బాలకృష్ణ మరింత స్మార్ట్‌గా