సీనియర్ సినీనటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాకినాడలో జన్మించిన ఈమె.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు.
1961లో తొలిసారిగా 'సీతారామ కల్యాణం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచమైన గీతాంజలి.. కలవారి కోడలు, డా. చక్రవర్తి, బొబ్బిలియుద్ధం, దేవత, గూఢచారి116, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు.