ఆది పినిశెట్టి.. కోలీవుడ్‌లో హీరోగా రాణిస్తూనే, టాలీవుడ్లో కీలక పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం క్రీడా నేపథ్యమున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'క్లాప్' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి కానుకగా విడుదల చేసింది చిత్రబృందం. కింద రన్నింగ్ ట్రాక్, పైన క్లాప్, ఆ మధ్యలో ఆది ఫొటో.. అంచనాల్ని పెంచుతోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. మాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నాడు. ఫృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి చిత్రానికి దిల్‌రాజు మద్దతు