తెలుగు సినిమాలకు సంగీతమే ప్రాణం. కథ అంతంత మాత్రంగా ఉన్నా, వీటివల్లే కొన్ని చిత్రాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2019లో ఇందుకు భిన్నంగా జరిగింది. కొన్ని సినిమాల్లో కొన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. బొమ్మ మాత్రం ఆదరణ దక్కించుకోలేకపోయింది. సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నంతగా, ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? అందులోని పాటలేంటో చూసేద్దామా.
డియర్ కామ్రేడ్- 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే'
విజయ్ దేవరకొండ-రష్మిక జోడీ.. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే', 'ఎటు పోనే' వంటి అద్భుతమైన గీతాలు.. 'డియర్ కామ్రేడ్' సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. దక్షిణాదిలోని నాలుగు భాషల్లో విడుదల చేశారు. పాటలు ఆకట్టుకున్నంతగా, సినిమా ఆడలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏబీసీడీ-'మెల్ల మెల్ల మెల్లగా'
ఇందులో సిద్ శ్రీరామ్ పాడిన 'మెల్ల మెల్ల మెల్లగా' పాట.. శ్రోతల మనసు దోచింది. ఈ వీడియోలో హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ అందం.. అభిమానులను కట్టిపడేసింది. ఇవేవి సినిమాకు ప్లస్ కాలేకపోయాయి
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గుణ 369- 'బుజ్జి బంగారం'
కార్తికేయ నటించిన ఈ సినిమాలో 'నా బంగారం.. బుజ్జి బుజ్జి బంగారం' పాట.. చిత్రం రాకముందే పాపులర్ అయింది. ఈ హీరో.. మరో హిట్ కొట్టేలా ఉన్నాడనిపించింది. తీరా సినిమా విడుదలయ్యాక పాట బాగున్నా, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వినయ విధేయ రామ- 'ఏక్ బార్ ఏక్ బార్'
ఈ సినిమాలో రామ్‌చరణ్-కియారా అడ్వాణీ జంటగా నటించారు. పార్టీ మూడ్‌లో వచ్చే ఈ గీతంలో రామ్‌చరణ్ స్టెప్పులు, మాస్ బీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ రొటీన్ కథాంశం వల్ల డిజాస్టర్‌గా నిలిచిందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దొరసాని- 'నింగిలోన పాలపుంత'
హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్.. కథానాయకుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక.. 'దొరసాని'తో వెండితెరకు పరిచయమయ్యారు. గ్రామీణ ప్రేమకథలో పాటలు కొన్ని ఆకట్టుకున్నా, సినిమా మాత్రం అనుకున్నంత మేర ఆడలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మిస్టర్ మజ్ను- 'కోపంగా కోపంగా'
అక్కినేని అఖిల్- నిధి అగర్వాల్.. ఇందులో జోడీగా నటించారు. సినిమా కథలో బలం లేకపోవడం వల్ల, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
రివ్యూ 2019: తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే
రివ్యూ 2019: చెలరేగిన చిన్న సినిమాలు.. మెప్పించిన మల్టీస్టారర్లు