ETV Bharat / lifestyle

సరికొత్త డిజైన్లతో ఫ్యాషన్ మేళా! - latest fashion designs

కరోనాకి ఫ్యాషన్‌ ప్రపంచమేమీ అతీతం కాకపోవచ్చుగాక. కానీ కంప్యూటర్‌ యుగంలో డిజైనర్ల సృజనకు అడ్డేముందీ... త్రీడీ డిజైన్లూ, ఫొటో రియలిస్టిక్‌ డిజిటల్‌ మోడల్సూ, వర్చువల్‌ షోరూమ్‌లూ, ఆన్‌లైన్‌ షాపింగులూ... అన్నీ కలిసి ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో ఫ్యాషన్‌ ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. అలా సందడి చేస్తున్న లేటెస్ట్‌ ఫ్యాషన్లలో కొన్ని..

new fashion trends during corona pandemic
సరికొత్త డిజైన్లతో ఫ్యాషన్ మేళా!
author img

By

Published : Sep 20, 2020, 2:31 PM IST

బ్లౌజుకి కేప్‌ స్టైల్‌.!

బాలీవుడ్‌, టాలీవుడ్‌, టీవీ సీరియళ్లలో ఎవరిని చూసినా కామన్‌గా కనిపించే స్టైల్‌ ఒకటుంది. అదే కేప్‌ బ్లౌజ్‌ శారీస్‌. చీర కట్టుకున్నాక దానిమీదకి కేప్‌లు ధరించడం ఇటీవల బాగా ఫ్యాషనైంది. నిజానికి ఇలా కేప్‌ వేసుకోవడం అనేది యూరోపియన్ల స్టైల్‌. మధ్యయుగంలో అక్కడి సంపన్న వర్గాలు డ్రెస్‌ వేసుకున్నాక చేతుల్లేకుండా మెడ నుంచి భుజాల చుట్టూ ఉండేలా ఎంబ్రాయిడరీ చేసిన కేప్‌ని సాయంకాలం పార్టీల్లో ధరించేవారట.

అదే పాశ్చాత్య దేశాల్లో మళ్లీ ఫ్యాషన్‌గా మారింది. దాన్నే మన డిజైనర్లు కాస్త అటూఇటూగా మార్చేసి స్కర్టులూ చీరలూ లెహంగాలమీదకి నప్పేలా లేసు, నెట్‌ క్లాత్‌లతో డిజైన్‌ చేశారు. అయితే బ్లౌజ్‌ వేసుకున్నాక మళ్లీ కేప్‌ వేసుకోవడం ఎందుకు... నేరుగా బ్లౌజుకే కేప్‌ వేలాడుతున్న లుక్‌ తీసుకొస్తే పోలా అనిపించినట్లుంది కొందరికి. దాంతో ఇప్పుడు కేప్‌ పోయి, కేప్‌ బ్లౌజ్‌ సందడి మొదలైంది. ఎంబ్రాయిడరీ చేసిన షీర్‌ నెట్‌ స్లీవ్సూ, లేయర్ల స్లీవ్సూ... ఇలా రకరకాలుగా వీటిని డిజైన్‌ చేసేస్తున్నారు. వేలాడే చేతులవల్ల ఈ జాకెట్టు వేసుకుంటే కేప్‌ వేసుకున్న ఫీల్‌నీ సొంతం చేసుకోవచ్చట.

చెవులకి మట్టి సోకు!

డ్రెస్సుని బట్టి అమ్మాయిల చెవులకు ధరించే జుంకీలు మారిపోతుంటాయి. సంప్రదాయ దుస్తులయితే బంగారం, వన్‌గ్రామ్‌లో రంగుల రత్నాలను పొదిగి రకరకాల డిజైన్లలో చేసిన బుట్టలూ చాంద్‌బాలీ డిజైన్లలో చేసిన భారీ జుంకీలు పెడుతుంటారు. క్యాజువల్‌ డ్రెస్సులయితే రంగురంగుల రాళ్లూ క్రిస్టల్సూ ఇతరత్రా లోహాలతో చేసినవి పెడతారు. అయితే ఇప్పుడు వీటికి తోడుగా చాలానే వస్తున్నాయి. కాదేదీ పోగులకనర్హం అన్నట్లు టెర్రకోట, వెదురు, పాలీ క్లే... ఇలా రకరకాల మెటీరియల్స్‌తోనూ అందమైన చెవి లోలాకుల్ని తయారుచేస్తున్నారు. అందులోనూ పాలీ క్లేతో చేసిన ఫ్లోరల్‌ ఇయర్‌ రింగ్స్‌, అచ్చం నిజమైన పువ్వుల్నీ ఆకుల్నే తలపించేలా ఉండటంతో అమ్మాయిలకూ తెగ నచ్చేస్తున్నాయి.

కుర్తా బ్యాగూ... జోడీ!

అమ్మాయిలకి రకరకాల డ్రెస్సులూ వాటికి మ్యాచయ్యే యాక్సెసరీలూ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే డ్రెస్సుకి తగ్గ మ్యాచింగ్‌ వస్తువులకోసం- అది మాల్స్‌లో కావచ్చు, ఆన్‌లైన్‌లో కావచ్చు... ఎంత ఓపిగ్గా అయినా వెతికి మరీ కొంటుంటారు. ఆ శ్రమ తప్పిద్దాం అనే కాబోలు ఈమధ్య చాలా బ్రాండ్‌లు అన్నీ మ్యాచింగ్‌ ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటున్నాయి. చీరలకి బ్యాగుల్ని డిజైన్‌ చేసేవాళ్లు కొందరయితే, బ్యాగుకి శాండల్స్‌ మ్యాచ్‌ చేసేవాళ్లు మరికొందరు. ఇప్పుడు అవన్నీ దాటి కాలేజీ అమ్మాయిలు వేసుకునే ఫ్రాకులూ కుర్తీలు వంటి వాటికి మ్యాచయ్యేలా అచ్చం అదే క్లాత్‌తోనే బ్యాగుల్నీ రూపొందిస్తున్నాయి అనేక కంపెనీలు. సో, ఇక ఆ డ్రెస్సు వేసుకున్నప్పుడు బ్యాగు కోసం ప్రత్యేకంగా వెతికే పని ఉండదన్నమాట.

శాండల్స్‌ ముడి అదిరింది!

శాండల్స్‌లో రోజుకి కొన్ని వందల రకాల మోడల్స్‌ వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే స్టైలిష్‌గానూ సౌకర్యంగానూ ఉంటాయి. అందులోనూ గుచి లాంటి బ్రాండ్స్‌ తీసుకొచ్చే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది... వాటికి వాడే లెదర్‌ నుంచి డిజైన్‌ వరకూ అన్నీ ప్రత్యేకమే. అలా మార్కెట్లోకి వచ్చిన తాజా ఫ్యాషనే ఈ క్రాఫోర్డ్‌ నాట్‌ మెటాలిక్‌ శాండల్స్‌. అద్దాల్లా మెరిసే పాదాలకు మెటాలిక్‌ ముడులు మరింత అందాన్ని తీసుకొస్తాయన్న ఉద్దేశంతో వీటిని డిజైన్‌ చేశారట. అచ్చంగా ఏ లోహంతోనో తయారుచేసినట్లుగా మెటాలిక్‌ రంగుల్లో మెరిసే సుతిమెత్తని లెదర్‌ స్ట్రాప్‌ల్ని అందంగా ముడి వేసి మరీ రూపొందించిన ఈ శాండల్స్‌, ఈతరం అమ్మాయిల కళ్లను కట్టిపడేస్తాయనడంలో సందేహమేముంది!

మెడకి పాము... నయా డిజైన్‌!

‘అమ్మో... పామే... చూస్తేనే కలలోకొస్తుంది’ అని భయపడుతుంటారు కొందరు. కానీ పరమేశ్వరుడిలా ఆ పామునే తెచ్చి మెడలో అలంకరించుకుంటే అందమైన కంఠాభరణమై అందరినీ ఆకర్షిస్తుంది అంటున్నారు నయా జ్యువెలరీ డిజైనర్లు. అందుకే కోరల్‌, కింగ్‌, కోబ్రా... ఇలా రకరకాల పాముల్ని పోలిన పెండెంట్‌ నెక్లెస్సుల్ని అందమైన రాళ్లతో రూపొందిస్తున్నారు. అంతేనా... విషానికి విషమే విరుగుడు అన్నట్లు పాము భయం పోవాలంటే ఈ స్నేక్‌ లాకెట్లను వేసుకుంటే భయమూ పోతుంది, ఫ్యాషన్‌గానూ ఉంటుంది మరి. ఏమంటారు?

గోళ్లకు పూల సోయగం!

అమ్మాయిలకు నెయిల్‌ ఆర్ట్‌మీద ఉన్న మోజు అంతా ఇంతా కాదు. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే డ్రెస్సు ఎలాగున్నా ముందు గోళ్లకు అందమైన నెయిల్‌ పాలిష్‌ ఉండాల్సిందే. అందుకే నెయిల్‌ పాలిష్‌ల్లోనూ వేనవేల రకాలొస్తున్నాయి. డ్రై ఫ్లవర్‌ జెల్‌ నెయిల్‌జెల్‌ కూడా అలా వచ్చిందే. ఇది పూలూ, రేకులూ అన్నీ కలిపిన జెల్‌లాగానీ, విడివిడిగా గానీ దొరుకుతుంది. పూల జెల్‌ అయితే నేరుగా గోళ్లకు వేసుకుని లైటుకింద కాసేపు ఆరనిస్తే సరిపోతుంది. విడిగా దొరికే ఎండుపూల కిట్‌ను కొనుక్కుంటే, పారదర్శక పాలిష్‌ వేసి, ఆరాక పూలను గోరుమీద అమర్చి మరో కోట్‌ వేయాలి. లేదంటే జెల్‌లో కలిపీ వేసుకోవచ్చు. ఎలా వేసినా మీ గోళ్లు పూరేకుల అందాలతో మెరిసిపోతాయి మరి. ఇంత కష్టం వద్దనుకుంటే అతికించుకునే రెడీమేడ్‌వీ దొరుకుతున్నాయి.

చుక్కల్లో జీన్స్‌!

ఫ్యాషన్‌ ప్రపంచానికీ పోల్కా చుక్కలకీ ఉన్న బంధం ఈనాటిది కాదు. వందల సంవత్సరాల నుంచీ అది కొనసాగుతోంది. అందులోనూ అమ్మాయిల దుస్తులూ యాక్సెసరీల్లో వీటి వాడకం మరీ ఎక్కువ. కానీ ఎందుకో ఏమో తెలీదుగానీ జీన్స్‌ కంపెనీల దృష్టి పెద్దగా వాటిమీద పడలేదు. స్టోన్‌ వాష్‌ అంటూ వాటిని తెగ రుద్దేశారు, చించేశారు, ఎలుకలతో కొరికించారు, ఎంబ్రాయిడరీలూ కుట్టేశారు. రంగుల పూలనీ ముద్రించేశారు.... ఇలా చాలా రకాలుగా ఉతికి ఆరేశారు. కొత్తగా నీలాకాశంలో తళుకులీనే తారలు గుర్తొచ్చినట్లున్నాయి. వెంటనే అందమైన పోల్కాచుక్కల్నీ ఆ జీన్సు ప్యాంటుల్లోకి చొప్పించేశారు. ఇక, అమ్మాయిలకు నచ్చకుండా ఎలాగుంటాయి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.