ETV Bharat / jagte-raho

బంధాలను బజారున పడేసిన.. ఓ కసాయి తల్లి కథ ఇది!

ఆమె.. వివాహ బంధాన్ని విడిచి... పేగు బంధాన్ని మరిచి.. ప్రియుడే కావాలనుకుంది..!! ఇద్దరు పిల్లలుంటే.... చిన్నోడ్ని హతమార్చి... పెద్దోడి కాళ్లు విరగొట్టి... ఆస్పత్రి పేరుతో కథ అల్లేసింది... చివరికి పోలీసుల చేతికి చిక్కడంతో... విషయం వెలుగులోకి వచ్చింది..!!

The story of a mother who killed her children in Khammam district
బంధాలను బజారున పడేసిన.. ఓ కసాయి తల్లి కథ ఇది..!
author img

By

Published : Oct 8, 2020, 10:27 AM IST

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం సమీపంలోని మానుకొండ గ్రామానికి చెందిన ఉష, ప్రసాద్‌లు దంపతులు. వీరు తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వారికి ఇద్దరు పిల్లలు సుకుమార్‌ (4), అంకిత్‌ (18నెలలు)ఉన్నారు. ఉషకు కొణిజర్ల మండలం రామనర్సానగర్‌కు చెందిన సంపంగి శ్రీను అలియాస్‌ శివతో పనులు చేసే చోట పరిచయం ఏర్పడింది.

అతనికి గతంలోనే వివాహమైంది..ఆమె భర్తను, అతడు భార్యను వదిలేసి ఇద్దరూ రెండు నెలల క్రితం జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం వచ్చి అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. పిల్లలు ఇద్దరూ వారి వద్దే ఉంటున్నారు. ఈ నెల 4వ తేదీన రాత్రి పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆగ్రహానికి గురై ప్రియుడితో కలిసి తీవ్రంగా కొట్టింది. ఆ దెబ్బల దాటికి అంకిత్‌కు మూర్ఛ వచ్చి పడిపోయి కొద్దిసేపటికి మృతి చెందాడు. పిల్లలకు జ్వరం వచ్చింది..ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని స్థానికులతో నమ్మబలికి పిల్లలతో కలిసి ఇద్దరూ ఆటోలో బయలుదేరారు.

బంధాలను బజారున పడేశారు..!
అంకిత్‌, సుకుమార్‌ల పాతచిత్రం

యజమాని ఆరాతో :

ఆ ఇద్దరూ మరుసటి రోజు కూడా తిరిగి రాకపోవడంతో ఇంటి యజమానికి వారిపై అనుమానం వచ్చింది. స్థానిక వీఆర్వోతోపాటు, పోలీసులకూ సమాచారమిచ్చారు. ఈ మేరకు చిల్లకల్లు ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేట్టారు.

సిగ్నల్‌ ఆధారంగా:

రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరిని సెల్‌ఫోన్‌ టవర్‌ సిగ్నల్‌ ఆధారంగా బుధవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని తన దైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పారు. బాలుడి మృతదేహాన్ని కోదాడ మండలం చిలుకూరు గ్రామ సమీపంలోని గుట్టల వద్ద భూమిలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. సుకుమార్‌ కాళ్లను అట్లకాడతో కాల్చడంతో తీవ్రంగా గాయాలైనట్లు గుర్తించారు.

భారీగా చరవాణులు:

వారిద్దరూ అద్దెకు ఉంటున్న ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా 40 సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. నిందితుడు శివ సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు వారు అనుమానిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.