సికింద్రాబాద్‌లోని నల్లగుట్టకు చెందిన నీలం ప్రణీత్ సాయి(21) బేగంపేటలోని త్రివిక్రమ గోడౌన్లో సామ్సంగ్ చెక్ కలెక్షన్ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చాలా కాలం నుంచి పనిచేస్తుండటం వల్ల ప్రణీత్‌పై గోడౌన్ యజమానులు నమ్మకంతో ఉన్నారు. వారి నమ్మకాన్ని ఆసరా చేసుకుని.. అదను చూసి రోజుకో 32 ఇంచుల సామ్ సంగ్ టెలివిజన్ సెట్‌ను చోరీ చేయడం మొదలు పెట్టాడు. తన మిత్రుడు ధన్ క్రీ టాక్రే హరీందర్ (19)ను గోడౌన్ వద్దకు రమ్మని.. అతని వాహనంలో టెలివిజన్ సెట్‌ను పంపించేవాడు. మొత్తం రూ.6.75 లక్షల విలువైన 27 టెలివిజన్ సెట్లు చోరీ చేసిన ప్రణీత్, హరీందర్లు వాటిని విక్రయించారు.
టీవీ సెట్లు తగ్గుతుండటం వల్ల అనుమానం వచ్చిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని గోడౌన్‌పై నిఘా ఉంచిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రణీత్, హరీందర్లను అరెస్టు చేసి.. చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.