ETV Bharat / jagte-raho

దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు - Son kills mother in Nagarkarnool district

son killed mother in Singotam
దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు
author img

By

Published : Oct 24, 2020, 8:56 AM IST

Updated : Oct 24, 2020, 11:30 AM IST

08:52 October 24

దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు

నాగర్‌కర్నూల్ కొల్లాపూర్ మండలం సింగోటంలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లినే పొట్టనబెట్టుకున్నాడో కర్కశ కుమారుడు. తన ప్రాణం పోసి.. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే... కాలయముడవుతాడని తెలుసుకోలేకపోయింది.

అసలేం జరిగిందంటే... 

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన యువకుడు తల్లిని దారుణంగా హత్యచేశాడు. కొడవలితో విచక్షణారహితంగా గొంతుకోసి చంపాడు. గ్రామానికి చెందిన రాముడికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అతని ప్రవర్తనతో విసిగిపోయిన భార్య వదిలేసి వెళ్లిపోయింది. మద్యానికి బానిసైన రాముడు.. వృద్ధురాలైన తల్లితో రోజూ గొడవ పడేవాడు. తాగుడుకు డబ్బులు కావాలని ఇబ్బంది పెట్టేవాడు. రాత్రి అలాగే గొడవ పడి నిద్రిస్తున్న తల్లిని హత్యచేశాడు. గొంతు కోసి చంపేశాడు. తలను వేరు చేసి తనతోపాటు తీసుకొని పరారయ్యాడు. పెద్దకుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Oct 24, 2020, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.