ETV Bharat / jagte-raho

ఉదయం కార్లలో తిరుగుతూ రెక్కీ.. రాత్రి గ్యాస్​ కట్టర్లతో ఏటీఎం చోరీ

కార్లలో తిరుగుతూ రెక్కి నిర్వహించి... ఎవరూ లేని సమయంలో గ్యాస్ కట్టర్‌తో షట్టర్లు, ఏటీఎం మిషన్లను కోసి నగదును ఎత్తుకెళ్లే అంతరాష్ట్ర ముఠాను మహబూబ్​నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 28న జడ్చర్లలోని ఏటీఎంలో ఈ ముఠా చోరీకి పాల్పడిన కేసును ఛేదించారు. నిందితుల నుంచి రూ. 12 లక్షల నగదు సహా చోరీకి వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే దిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, హైదరాబాద్‌లో 100కు పైగా కేసులున్నాయని తెలిపారు.

ఉదయం కార్లలో తిరుగుతూ రెక్కీ.. రాత్రి గ్యాస్​ కట్టర్లతో ఏటీఎం చోరీ
ఉదయం కార్లలో తిరుగుతూ రెక్కీ.. రాత్రి గ్యాస్​ కట్టర్లతో ఏటీఎం చోరీ
author img

By

Published : Oct 23, 2020, 8:05 PM IST

Updated : Oct 23, 2020, 9:03 PM IST

విమానాలు, కార్లలాంటి ఖరీదైన వాహనాల్లో వచ్చి, దక్షిణ భారతదేశంలో ఏటీఎంలను దోచుకుంటున్న హరియాణాకు చెందిన దొంగల ముఠాను మహబూబ్​నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక నేరస్థుల సహకారంతో గ్యాస్ కట్టర్ల లాంటి పరికరాలను వినియోగించి ఏటీఎంలను దోచుకోవడం ఈ ముఠా నైజం.

మాస్కులు ధరించి...

దోచుకోవడానికి ముందు మాస్కులు ధరించి, ఏటీఎంల ముందు రెక్కీ నిర్వహిస్తారు. మాస్కులు వేసుకుని దోపిడీకి పాల్పడతారు. దొంగతానికి ముందు అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్​తో షట్టర్లను, ఏటీఎం మిషన్​లను కోసి అందులోని నగదును దోచుకెళ్తారని మహబూబ్​నగర్ ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

కాలిపోయిన నగదు...

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ ఏటీఎంలో గత నెల 28న అర్ధరాత్రి ఇదే ముఠా చోరీకి పాల్పడింది. రూ. 41లక్షల 7వేల 900 నగదును అందులోంచి దోచుకెళ్లింది. గ్యాస్ కట్టర్ వినియోగించగా అందులోని నగదు కొంత కాలిపోయింది. నిందితుల నుంచి రూ. 12లక్షల 7వేలు, 40 బ్లాక్డ్ ఏటీఎం కార్డులు, చోరీకి వినియోగించిన కారు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ము

కేవలం 7 నిమిషాల్లో...

తొలుత మహబూబ్​నగర్, జడ్చర్ల, కొత్తకోట ఏటీఎంలపై రెక్కీ నిర్వహించారు. జడ్చర్ల సిగ్నల్ గడ్డ ఏటీఎంను లక్ష్యంగా ఎంచుకున్నారు. అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం ముందు జనరేటర్ ఉండటమే చోరీకి ఎంతగానో ఉపయోగపడిందని, కేవలం 7 నిమిషాల్లో ఏటీఎంను కోసి నగదును దోచుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.

చోరీలకు ఉపయోగించినపరికరాలు
చోరీలకు ఉపయోగించినపరికరాలు

చోరీలకు తెర...

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం హర్యానాకు చెందిన సబీర్​ఖాన్, తాలిమ్​ఖాన్, జాహిద్​ఖాన్, ధన్వీర్ పాయి​లా గుజ్జర్, సఖీబ్​ఖాన్ వీళ్లంతా పాత స్నేహితులే. హరియాణా, దిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడ్డ నేరచరిత్ర వీరికి ఉంది. వీళ్లకు చంచల్​గూడ జైల్లో హైదరాబాద్ చెందిన పాత నేరస్థుడు మహ్మద్ రహమాన్​తో పరిచయం ఏర్పడింది. తెలంగాణలో ఏటీఎంల చోరీకి తెరతీశారు.

57 భారీ దొంగతనాలు...

ఒకేసారి పెద్దమొత్తంలో సులువుగా డబ్బు సంపాదించాలన్న దురాశతో ఈ ముఠా పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆరుగురు నిందితులను వారి డెన్​లోనే దాడి చేసి జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణాకు ధన్వీర్ పాయిలా గుజ్జర్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సుమారు 57 భారీ దొంగతనాలు, మోసాలతో పాటుగా, వీరిని పట్టుకోబోయిన పోలీసులపై తుపాకులతో కాల్పులు జరిపిన కేసుల్లోనూ నిందితులుగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి: చెక్​డ్యామ్​ వద్ద సెల్ఫీ... తల్లి మృతి, కుమారుడు గల్లంతు

Last Updated : Oct 23, 2020, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.