తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడిపి నలుగురు ప్రాణాలు తీశాడు. రావులపాలెం మండలం రావులపాడు వద్ద జరిగిన ఈ ఘటన పండుగపూట కొందరి జీవితాల్లో విషాదం నింపింది.
జాతీయరహదారిపై మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతుండగా అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొని రహదారికి అటువైపునకు దూసుకెళ్లింది. అవతలి రోడ్డులో అటువైపుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో... అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామస్థులుగా గుర్తించారు. ప్రమాదానికి కారకులైన వాళ్లు మద్యం మత్తులోఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు కారు దిగి పరారయ్యారు.
ఇవీ చదవండి: కాంగ్రెస్ సవాల్ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!