ETV Bharat / jagte-raho

షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు - ప్రియాంకరెడ్డి హత్య కేసులో పోలీసుల అదుపులో నలుగురు

priyanka reddy
priyanka reddy
author img

By

Published : Nov 29, 2019, 10:49 AM IST

Updated : Nov 29, 2019, 3:56 PM IST

10:47 November 29

షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

షాద్​నగర్​ ఘటన కేసులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్ పాషా, గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మహ్మద్ పాషాను ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. హత్య కేసులో నిందితులంతా 25 ఏళ్ల లోపు వారే ఉండటం గమనార్హం

ఆమెపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్యచేసినట్లుగా గుర్తించారు. లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు హత్య చేసినట్లు నిర్ధరించారు. టోల్‌ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో అత్యాచారం చేసి హత్యచేశారు. 

తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో హత్య చేసి ఉంటారని పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు తేల్చారు. శరీరం గంట పాటు తగల బడినట్లు భావిస్తున్నారు. శరీరం పూర్తిగా తగలబడటం వల్ల పోస్టుమార్టం క్లిష్టంగా మారింది. మెడను చున్నితో బిగించి హత్య చేసి ఉండొచ్చని  వైద్యులు అనుమానిస్తున్నారు. తలపైనా గాయాన్ని గుర్తించారు.

Last Updated : Nov 29, 2019, 3:56 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.