ETV Bharat / international

'చమురు రంగంలో 100 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు' - modi in fii

భారత్​ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా రియాద్​లో జరిగిన విదేశీ పెట్టుబడుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో చమురు రంగంలో 100 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ
author img

By

Published : Oct 29, 2019, 10:00 PM IST

Updated : Oct 29, 2019, 11:44 PM IST

సౌదీలో మోదీ పర్యటన

భారత్​ పెట్టుబడులకు స్వర్గధామమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. సౌదీతో అనుబంధం ఏళ్లనాటిదని.. రెండు దేశాల మధ్య దృఢమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.

సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా రియాద్​లో జరిగిన విదేశీ పెట్టుబడుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సదస్సునే "దావోస్​ ఇన్​ డిజర్ట్​"గా పిలుస్తారు.

"అంకురసంస్థ నిర్వహణలో ప్రపంచంలో భారత్​ 3వ స్థానంలో ఉంది. భారత్​లోని 2,3 స్థాయి నగరాల్లోనూ అంకురసంస్థలు వచ్చాయి. ప్రపంచ స్థాయిలో ఇవి పెట్టుబడులు పెడుతున్నాయి. వీటిల్లో పెట్టుబడులు పెట్టి మీరు లాభం పొందాలని ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నా.

భారత్​లో గ్యాస్​, చమురు రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. 2024 వరకు చమురు శుద్ధి, పైప్​లైన్స్, గ్యాస్​ టెర్మినళ్ల కోసం 100 బిలియన్ డాలర్లు సమకూర్చనున్నాం. సౌదీ ఆరాంకో పశ్చిమ తీర రిఫైనరీల్లో పెట్టుబడులు పెట్టనుండటం సంతోషంగా ఉంది. ఈ శుద్ధి కేంద్రం ఆసియాలోనే అతిపెద్దది కానుంది."

-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారత్​.. 83శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం మౌలిక సదుపాయాలను సమకూర్చుకునే దిశగా భారత్​ కృషి చేస్తోందని తెలిపారు.

సంబంధాల్లో నైపుణ్యమూ భాగమే..

స్కిల్​ ఇండియా ద్వారా 40 కోట్లమందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. దీని ద్వారా భారత్​లో ప్రారంభించబోయే అంకుర సంస్థల్లో మానవ వనరుల కొరత తీరుతుందని తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలు కేవలం వస్తువుల వరకు మాత్రమే పరిమితం కావద్దని.. మానవ వనరులు, నైపుణ్యం అందులో అంతర్గతం కావాలని ఆకాంక్షించారు.

'మంచి మార్పుకు ఐరాస కృషి చేయాలి'

పెట్టుబడుల సదస్సులో భాగంగా బ్రిడ్జ్​వాటర్​ అసోసియేట్స్​ సహ ఛైర్మన్​ రే దలియోతో విస్తృతంగా చర్చించారు మోదీ. ఐరాస లాంటి అంతర్జాతీయ సంస్థలు సకారాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. కానీ కొంతమంది ఐరాసను సంస్థగా కాకుండా ఓ సాధనంగానే చూస్తున్నారని దేశం పేరు ప్రస్తావించకుండా విమర్శించారు.

"కొంతమంది శక్తిమంతమైన వ్యక్తులు ఐరాసను సాధనంగా మాత్రమే పరిగణిస్తున్నారు. సంస్థగా గుర్తించటం లేదు. కొంతమంది చట్టం, నిబంధనలను పాటించట్లేదు. మరికొంత మంది అవే చట్టాల కింద నలిగిపోతున్నారు. ప్రపంచమంతా చట్టానికి కట్టుబడి ఉండాలి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

వివాదాల పరిష్కారాల్లో ఐరాస ఏ మేరకు కృషిచేస్తోందని సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించానని.. అయితే దీనిపై సరైన చర్చ జరగలేదని మోదీ తెలిపారు. ఐరాస వజ్రోత్సవాల సమయంలోనైనా ఈ అంశం ప్రస్తావనకు రావాలని ఆశించారు.

ఐరాస భద్రతామండలిలో జీ-4 దేశాలైన భారత్​, బ్రెజిల్, జర్మనీ, జపాన్​కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఎప్పటినుంచే డిమాండ్​ ఉందని గుర్తుచేశారు. అయితే దిశగా ఎలాంటి స్పందన లేదని ఆక్షేపించారు.

యువరాజుతో భేటీ

అంతకుముందు సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో భేటీ అయ్యారు మోదీ. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని తీర్మానించారు ఇరు నేతలు. ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని పెంపొందించుకునే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

ఇదీ చూడండి: పాక్​ను సుతిమెత్తగా హెచ్చరించిన ఐసీఏఓ

AP Video Delivery Log - 1500 GMT News
Tuesday, 29 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1452: MidEast Gantz AP Clients Only 4237264
Netanyahu's main rival addresses Jewish leaders
AP-APTN-1448: Lebanon Saad Hariri AP Clients Only 4237262
Lebanon's Hariri stepping down amid ongoing unrest
AP-APTN-1436: Archive Saad Hariri AP Clients Only 4237258
Lebanon PM resigns amid nationwide protests
AP-APTN-1434: Lebanon Protest Hezbollah Tension 2 AP Clients Only 4237257
Tension as Hezbollah supporters crash protest camp
AP-APTN-1413: Pakistan Sharif AP Clients Only 4237256
Reax as Pakistan court suspends Sharif conviction
AP-APTN-1407: Iraq Karbala Attack AP Clients Only 4237212
Masked men attack protesters in Karbala, 18 dead
AP-APTN-1358: US House Intel Arrivals AP Clients Only 4237251
Army officer Vindman arrives for Hill testimony
AP-APTN-1346: Lebanon Protest Hezbollah Tension AP Clients Only 4237248
Tension as Hezbollah supporters crash protest camp
AP-APTN-1342: China Commerce AP Clients Only 4237250
China pledges better conditions for foreign firms
AP-APTN-1341: Cambodia Search AP Clients Only 4237249
Search for UK woman missing in Cambodia continues
AP-APTN-1314: Lebanon Protest Hezbollah AP Clients Only 4237244
Hezbollah supporters ransack Beirut protest site
AP-APTN-1301: Belgium EU Venezuela AP Clients Only 4237242
EU: Venezuela meeting raises $130m for refugees
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 29, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.