దక్షిణ ఆస్ట్రేలియా ప్రజలను దావానలం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏకంగా 40 చోట్ల కార్చిచ్చులు చెలరేగాయి. పలు ఇళ్లు, వ్యాపార భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. జన జీవనం స్తంభించింది. దావానలం ఉగ్రరూపం దాల్చే అవకాశముందని.. జాగ్రత్తగా ఉండాలని స్థానికులను అప్రమత్తం చేశారు అధికారులు.
కార్చిచ్చు ధాటికి గత పదేళ్లలో తొలిసారి విక్టోరియాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 40సెల్సియస్‌కు చేరుకున్నట్లు తెలిపారు. కార్చిచ్చు కారణంగా విక్టోరియాను దట్టమైన పొగ కమ్మేసింది.
మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. విమానాలతో సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: కార్చిచ్చులో మూగజీవి నరకయాతన- కాపాడిన వీరనారి