ప్రాణాంతక కరోనా వైరస్ బ్రిటన్కూ వ్యాపించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు వైరస్ సోకినట్లు అక్కడి ప్రభుత్వం నిర్ధరించింది. బాధితులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
''ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను జాతీయ ఆరోగ్య సంస్థ-ఎన్హెచ్ఎస్ పరీక్షించింది. వారికి వైరస్ సోకినట్లు నిర్ధరించింది. ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందిస్తున్నాం. వైరస్ను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రోగులను గుర్తించడానికి అన్ని విధాలా సిద్ధం అవుతున్నాం. కరోనా విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.''
-క్రిస్ విట్టి, బ్రిటన్ ముఖ్య వైద్య అధికారి
ప్రపంచ దేశాలతో కలిసి..
కరోనాపై పోరాటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), విదేశాలతో పని చేయడానికి సిద్ధమేనని చెప్పారు క్రిస్.
వైరస్ కారణంగా చైనాలో 213 మంది మృతి చెందారు. ఇతర దేశాల్లోనూ కరోనా విజృంభణ నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ఇదీ చదవండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు సిద్ధంగా లేవు'