ETV Bharat / international

11 లక్షల మందిని చంపేసింది ఇక్కడే....

రెండో ప్రపంచ యుద్ధం నాటి నాజీల దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. మాటలకు అందని క్రూరత్వంతో సాటి మనుషులన్న దయ కూడా లేకుండా చేసిన అకృత్యాలు.. భూమండలంపై నాజీలు తప్ప ఎవరూ మిగిలి ఉండకూడదన్న సామాజ్యవాదం ధాటికి లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలకు అనేక ఉదాహరణలు కథలుగా బయటకొచ్చాయి. నియంత హిట్లర్ మూకలు మనుషులను చంపేందుకు వాడిన పద్ధతులు గమనిస్తే కరడుగట్టినవారికీ కళ్లు చెమర్చక మానవు. వారి హత్యా విధానాలపై ఓ కథనం.

hitler
ఇక్కడే 11 లక్షలమందిని చంపేశారు..
author img

By

Published : Jan 27, 2020, 1:15 PM IST

Updated : Feb 28, 2020, 3:23 AM IST

చిన్నారి షెండికి ఏమీ అర్థం కావడం లేదు.. అందరూ ఇంట్లోని సామాన్లను సర్దుకుంటున్నారు.. ఇంతలో తలుపులపై గట్టిగా శబ్దం.. త్వరగా రెడీ కావాలంటూ అధికారంతో నిండిన గొంతు హెచ్చరిక.. వెంటనే షెండి తల్లిదండ్రులు తమ వస్తువులను తీసుకొని కుమార్తెతో పాటు బయటకొచ్చేశారు. అది ఐరోపాలోని ఒక చిన్న పట్టణం.. నగరంలో ఉన్న 1200 మంది యూదు జాతీయులను బయలుదేరమని జర్మన్‌ నాజీలు ఆదేశించారు. అయితే తాము వెళ్లబోయేది మృత్యుకేంద్రానికి అని వారికి తెలియదు.. తమ దేశాన్ని ఆక్రమించిన నాజీలు తమను దూరంగా ఉండే కర్మాగారాల్లో పనిచేసేందుకు తీసుకువెళుతున్నారని వారు భావించారు. వెంటనేవారిని ఒక గూడ్సురైలులో పోలండ్‌లోని ఆష్‌విజ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే వేలాదిమంది యూదులున్నారు.

ఆష్‌విజ్‌ లక్షలాది హత్యలకు వేదిక..

1939లో పోలండ్‌ను నాజీ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఐరోపాలోని యూదులతో పాటు నాజీ వ్యతిరేకమైన ఇతర జాతీయులను నిర్మూలించాలన్న హిట్లర్‌ యోచన కార్యరూపం దాల్చింది. పోలండ్‌లోని ఆష్‌విజ్‌లో ఒక కర్మాగారం లాంటి బందీఖానాను నిర్మించారు. యూరప్‌లోని పలు దేశాలను ఆక్రమించిన నాజీలు అక్కడ ఉన్న యూదులను కుటుంబాలతో సహా ఇక్కడకు పంపించేవారు. అక్కడ వారిని గ్యాస్‌ ఛాంబర్లకు పంపించి సామూహికంగా హత్య చేసేవారు.

hitler
నాటి జైళ్లు

బలహీనంగా కనిపిస్తే చాలు..

అప్పటికే గూడ్సురైలు ప్రయాణంలో నీరసపడిన యూదులకు ఇక్కడకు చేరుకోగానే వైద్య పరీక్షలు నిర్వహించేవారు. బలహీనంగా ఉన్న వారిని గ్యాస్‌ ఛాంబర్లకు పంపించేవారు. వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఎలాంటి అంటురోగాలు రాకుండా పరీక్షలకని నమ్మించేవారు. ఒక వేళ దీన్ని ఎవరైనా పసిగట్టి పారిపోవాలని యత్నిస్తే జాగిలాలు వెంటపడేవి. వారిని సైనికులు కాల్చిచంపేవారు.

hitler
నాజీలకు బందీలయిన వారు

15 నిమిషాల్లోనే 2000 మందిని చంపేవారు..

గ్యాస్‌ ఛాంబర్లలోకి ఒక్కో దఫాలో 2 వేలమంది వరకు పంపించేవారు. వీరిని చంపేందుకు నాజీలు ప్రత్యేకమైన విషవాయువులను తయారుచేశారు. దాదాపు 15 నిమిషాల్లో ఈ వాయువులను పీల్చినవారు మృత్యు ఒడికి చేరుకునేవారు. అనంతరం శవాలపై బంగారు ఆభరణాలుంటే సైనికులు దోచుకునేవారు. ఇక్కడ దాదాపు 11 లక్షలమందిని చంపినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఒక నెల బిడ్డ నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఎలాంటి జాలి లేకుండా చంపేశారు. వీరిలో యూదులతో పాటు 75 వేలమంది పోలండ్ వాసులు, 21 వేల రోమా జాతీయులు, 14 వేలమంది సోవియట్‌ యుద్ధఖైదీలు ఉన్నారు.

hitler
కర్మాగారం వంటి బందీఖానా

సోవియట్‌ ప్రవేశంతో విముక్తి..

1945లో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. లక్షలాదిమంది మృతికి కారణమైన హిట్లర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రష్యన్‌సేనలు ఇక్కడ ప్రవేశం చేసి బందీలను విముక్తి చేశారు. అయినవారు అందరూ చనిపోగా మిగిలి ఉన్న కొందరు జీవచ్ఛవాలుగా మిగిలారు. 1945 జనవరి 27న ఆష్‌విజ్‌ను రష్యన్‌ సేనలు విముక్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఊచకోతలో బలైన లక్షలాదిమంది జ్ఞాపకార్థం యూరప్, అమెరికా, ఇజ్రాయెల్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చూడండి: ఆవు కోసం పులితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Intro:Body:

Alleged attempt to hurl petrol bomb at residence of Thuglak magazine's editor S Gurumurthy  

Attempt was carried out to hurl petrol bomb in Gurumurthy's residence in Mylapore at 3.30 am Sunday. Six assailants reportedly tried to carry out the attack but escaped when they were stopped by the police. The police immediately alerted the Mylapore police station. No one was hurt in the attack.

Police sources told, Later, the CCTV footage showed a few bike-borne men, towards whom alleged intruders ran and climbed over the bikes. The police have arrested three Accused Namely Tamil, Janardhanan and Sasikumar belonging to Periyar Dravidar kazhagam. Remaining three suspects they will be arrested soon,  says police sources.

This Comes In the backdrop of Rajinikanth's controversial comments on Periyar EV Ramasamy, was sparked after actor Rajinikanth spoke about it in the Tughlak 50th anniversary event held at Chennai on January 14. 

The actor had said that in 1971 at Salem, Periyar took out a rally in which undressed images of Lord Sri Ramachandramoorthy and Sita with a garland of sandal featured and no news outlet published it.  None of the newspapers at the time published this news but Cho (Ramasamy) sir put it on the cover of the magazine and criticised it harshly. 

However, his statements were met with severe opposition from Periyarist, who denied that the gods were naked and emphasising that there was no garland of chappals on the gods at the rally.Though they demanded an apology from Rajinikanth for ‘trying to mislead people by stating wrong information, Rajinikanth later refused to apologise for his remarks on Periyar. He said, I did not make up what I said, there are even published stories in media on it, I can show them. I will not apologize.  

The youngsters who attempted to carry out the attack on Gurumuthy's house on Sunday, are yet to be nabbed. An investigation is underway. 

Conclusion:
Last Updated : Feb 28, 2020, 3:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.