భారత సంతతి బ్రిటన్ ఎంపీ లీసా నాండీ.. లేబర్ పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నారా అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ఓటమి అనంతరం జెరెమీ కార్బిన్ స్థానంలో లీసాను ఎన్నుకునేందుకు పార్టీ నేతలు నిర్ణయించారని సమాచారం.
లీసా పోటీ చేసిన విగాన్ నియోజకవర్గం లేబర్ పార్టీకి మంచి పట్టున్న ఇంగ్లాండ్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. అయితే ప్రధాని బోరిస్ జాన్సన్ అనుకూల పవనాలతో లేబర్ పార్టీకి బలమైన కంచుకోటగా పిలిచే ఈ ప్రాంతంలో.. కన్జర్వేటివ్‌లు విజయం సాధించారు. అయితే కన్జర్వేటివ్‌లను తట్టుకుని విగాన్లో విజయం సాధించారు లీసా.
లేబర్ పార్టీ ఓటమి అనంతరం ఇకపై తాను పార్టీకి నాయకత్వం వహించబోనని ప్రకటించారు బోరిస్ జాన్సన్. ఈ నేపథ్యంలోనే పార్టీకి నేతృత్వం వహించే అంశమై తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు లీసా.
"నిజాయతీగా చెప్పాలంటే నేను నాయకత్వ అంశమై తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఎన్నికల్లో ఘోర పరాజయమే నాయకత్వ అంశమై ఆలోచించడానికి కారణం. లేబర్ పార్టీకి పట్టున్న స్థానాల్లో పార్టీ పునాదులు కదలిపోయాయి. సంప్రదాయ ఓటర్లను తిరిగి మా వైపు ఆకర్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. "
-లీసా నాండీ, భారత సంతతి బ్రిటన్ ఎంపీ
ఇదీ చూడండి: 'పౌర'చట్టంపై దిల్లీ జామియా వర్శిటీలో రగడ