అట్లాంటిక్‌ను అతి తక్కువ సమయంలో దాటేసి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం సరికొత్త రికార్డు నెలకొల్పింది.
న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం కేవలం 4గంటల 56 నిమిషాల్లోనే లండన్‌లోని హిత్రో విమానాశ్రయానికి చేరుకుంది. ఫలితంగా నార్వే ఎయిర్ వేస్ విమానం పేరిట ఉన్న రికార్డు(5 గంటల 16నిమిషాలు)ను తిరగరాసింది.
ఫ్లైట్రాడార్24 ప్రకారం న్యూయార్క్ నుంచి లండన్ చేరడానికి సగటున 6 గంటల 13 నిమిషాలు సమయం పడుతుంది. కానీ బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం 102 నిమిషాలు ముందుగానే గమ్యాన్ని చేరుకున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: చైనాకు 'కరోనా' కష్టాలు- రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం