ఐరోపా సమాఖ్యకు చెందిన పార్లమెంట్ సభ్యులు బృందం భారత్‌లో పర్యటిస్తోంది. దిల్లీలో ఇవాళ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్‌తో సమావేశమయ్యారు ఎంపీలు. కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిస్థితులపై చర్చించారు.
కశ్మీర్లో పర్యటన..
క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం కోసం రేపు జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది ఈయూ ఎంపీల బృందం. అధికరణ 370 రద్దు అనంతరం విదేశీ ప్రతినిధుల బృందం కశ్మీర్లో పర్యటించటం ఇదే తొలిసారి.
భారత్‌కు జైకొట్టిన ఐరోపా సమాఖ్య...
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ అంతర్జాతీయ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. కానీ.. ఈ విషయంపై ఐరోపా సమాఖ్య భారత్‌కు మద్దతుగా నిలిచింది.
ఇదీ చూడండి: మోదీకే అనుమతి ఇవ్వరా.. పాక్‌పై భారత్ ఫిర్యాదు.!