ETV Bharat / international

60 ఏళ్ల వయస్సు... పడి పడి లేచే మనస్సు!

ఆ బామ్మది 60 ఏళ్ల వయస్సు. కానీ ఆమెది పడిపడి లేచే మనస్సు. పట్టుకో పట్టుకో... కళ్లెమేసి పట్టుకో అని అందరినీ సవాల్ చేస్తోంది. సంగీతం అంటే చెవికోసుకునే ఆ బామ్మ తన అద్భుత నృత్యంతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

60 ఏళ్ల వయస్సులో దుమ్మురేపుతున్న బామ్మ డాన్స్​
author img

By

Published : Oct 15, 2019, 8:04 PM IST

Updated : Oct 16, 2019, 3:27 AM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ కాలంలో 40 ఏళ్లు వచ్చేసరికి శరీరం సహకరించడం లేదంటుంటారు చాలామంది. అటువంటిది 60 ఏళ్లు వచ్చినా పదహారేళ్ల పడుచుపిల్లలా ఎగురుతోంది ఈ బామ్మ. ఆమె పేరు టయోకా. ఏ దేశమో తెలియదు కానీ ఓ ఇంగ్లీష్ పాటకు లయబద్ధంగా స్టెప్పులేస్తూ నెటిజన్లందర్నీ మైమరిపిస్తోంది. యువత కూడా ఈర్ష్య పడేలా మెలికలు తిరుగుతోంది. ఈ వయస్సులో కూడా ఇంత బాగా ఎలా డ్యాన్స్​ చేయగలుగుతున్నారని చాలా మంది నెటిజన్లు టయోకాను అడిగారట. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపిన టయోకా పాట వినబడితే చాలు తనను తాను మర్చిపోతానంటోంది.

ఇప్పటి వరకు ఈ బామ్మ నృత్యాన్ని దాదాపు 40 లక్షల మంది వీక్షించగా 4 లక్షలకు పైగా షేర్స్, 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. బహుశా ఈ మధ్యకాలంలో ఇంతగా వైరల్ అయిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో లేదేమో అనేంతగా నెటిజన్లను మెప్పిస్తోంది. కావాలంటే ఈ వీడియో చూడండి. మీ నోటి నుంచి కూడా నిజమే అన్న మాట రాకమానదు..!

ఇదీ చూడండి: 'దంగల్​ చిత్రం.. చైనా అధ్యక్షుడ్నే మెప్పించింది'

Shivamogga (Karnataka), Oct 15 (ANI): The Traffic Police of Karnataka's Shivamogga district conducted an awareness drive through bike rally on October 14. The bike rally was held to spread awareness among people about new traffic and road safety rules. Police officials were carrying placards carrying different awareness messages including -'Drive Don't Fly', 'Use Your Head, Use A Helmet' etc. The main aim behind conducting bike rally was to create alertness about wearing helmet while driving.
Last Updated : Oct 16, 2019, 3:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.