ETV Bharat / international

2019: రెండో అత్యంత వేడి సంవత్సరం! - అత్యంత వేడి సంవత్సరం

2019ని ప్రపంచ రెండో అత్యధిక వేడి సంవత్సరంగా ప్రకటించింది ఐరోపా సమాఖ్య వాతావరణ పర్యవేక్షణ సంస్థ. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 తొలి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.

hot year
అత్యంత వేడి సంవత్సరం
author img

By

Published : Jan 9, 2020, 6:32 AM IST

Updated : Jan 9, 2020, 7:26 AM IST

ప్రపంచవ్యాప్తంగా 2019 రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా నిలిచిందని ఐరోపా సమాఖ్య వాతావరణ పర్యవేక్షణ సంస్థ ప్రకటించింది. గడిచిన పదేళ్లను.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా పేర్కొంది ఆ సంస్థ.

కోపర్​నికస్​ క్లైమెట్​ చేంజ్​ సర్వీస్ (సీ3ఎస్​) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2016 తర్వాత, గతేడాది.. 0.12 డిగ్రీ సెల్సియస్​ ఉష్ణోగ్రత పెరిగింది. ఎల్​నినో ప్రభావం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది.

2010 నుంచి 2019 వరకు చివరి ఐదేళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సీ3ఎస్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 2019లో.. 1981-2010 మధ్య కాలంతో పోలిస్తే ఉష్ణోగ్రత 0.6 డిగ్రీ సెల్సియస్​ పెరిగినట్లు తెలిపింది సీ3ఎస్​. భూతాపం పారిశ్రామికీకరణకు ముందుతో పోలిస్తే.. గత ఐదేళ్లలో 1.1 సెంటిగ్రేడ్​ నుంచి 1.2 సెంటిగ్రేడ్​ పెరిగిందని సీ3ఎస్​ వెల్లడించింది.

ఐరోపా వరకు అయితే గతేడాదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. 2019 రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాది అయిప్పటికీ.. మొదటి స్థానంలో ఉన్న 2016తో పోలిస్తే 0.04 సెంటిగ్రేడ్​ ఉష్ణోగ్రత మాత్రమే తక్కువగా ఉన్నట్లు సీ3ఎస్​ పేర్కొంది. ఉష్ణోగ్రతతో పాటు వాతావరణంలో కార్బన్ శాతం 2019లోనూ పెరిగి చరిత్రలో అత్యధిక స్థాయికి చేరినట్లు తేలింది.

గ్రీన్​ హౌస్​ ఎఫెక్ట్​

2030 వరకు ప్రతి ఏటా మానవ నిర్మిత గ్రీన్​హౌజ్ ఉద్గారాలు 7.6 శాతం చొప్పున తగ్గాల్సిన అవసరం ఉందని గత ఏడాది ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అప్పటి వరకు 1.5 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగకుండా ఇది అవసరమని అన్ని దేశాలకు సూచించింది.

2020 తొలి వారంలో వాతావరణ మార్పుల కారణంగా ఆస్ట్రేలియా (దక్షిణ ప్రాంతం)లో కార్చిచ్చు, ఇండోనేసియాలో భారీ వర్షాలు పదుల సంఖ్యలో మనుషుల మృతికి కారణమయ్యాయి.

ఉష్ణోగ్రతలు ఇలానే పెరుగుతూ పోతే.. భవిష్యత్​లో ఇలాంటి పరిణామాలు తరచూ ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు నిస్సందేహంగా ప్రమాదకర సంకేతాలని వారంటున్నారు.

గత ఏడాది అలాస్కా, ఆర్కిటిక్​లోని ఇతర ప్రాంతాల్లో సహా ఆస్ట్రేలియాలో వాతావరణం ఎక్కువగా వేడెక్కినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఐరోపాలో ప్రతి కాలంలో ఉండే సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2019లో అధిక వేడి నమోదైనట్లు సీ3ఎస్​ పేర్కొంది. 2019 డిసెంబర్​లో.. 1981-2010 మధ్య శీతాకాలంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 3.2 సెంటిగ్రేడ్​ ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లోని గ్రీన్​జోన్​పై రాకెట్లతో దాడి

Last Updated : Jan 9, 2020, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.