ETV Bharat / international

నవాజ్​షరీఫ్​ విదేశీ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్​ - చికిత్స కోసం విదేశాలు వెళ్లేందుకు నవాజ్​షరీఫ్​కు కోర్టు అనుమతి

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ వైద్య చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లడానికి లాహోర్​ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. అలాగే విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించిన వ్యక్తుల జాబితా నుంచి షరీఫ్‌ పేరు తొలగించాలని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి సూచించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న షరీఫ్​ లండన్​లో చికిత్స తీసుకోవాలని భావిస్తున్నారు.

విదేశాలు వెళ్లేందుకు నవాజ్​షరీఫ్​కు కోర్టు అనుమతి
author img

By

Published : Nov 17, 2019, 6:49 AM IST

Updated : Nov 17, 2019, 3:01 PM IST

నవాజ్​షరీఫ్​ విదేశీ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్​

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు కోర్టులో ఊరట లభించింది. వైద్య చికిత్స కోసం నాలుగు వారాలపాటు లండన్‌ వెళ్లేందుకు ఆయనకు లాహోర్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది. వైద్యుల సలహా మేరకు ఈ గడువును మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపింది.

నిషేధిత జాబితా నుంచి ..

విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించిన వ్యక్తుల జాబితా నుంచి షరీఫ్‌ పేరు తొలగించాలని లాహోర్ హైకోర్టు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి సూచించింది. బహుళ ఆరోగ్య సంక్లిష్టతల కారణంగా షరీఫ్​ ప్లేట్‌లెట్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఆయన లాహోర్‌లోని తన నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. లండన్‌లో వైద్య చికిత్స కోసం వెళ్లేందుకుగాను 7.5 బిలియన్ల బాండ్‌ సమర్పించాలన్న ఇమ్రాన్‌ సర్కార్‌ నిర్ణయంపై పీఎమ్​ఎల్​.... లాహోర్‌ హైకోర్టులో సవాల్‌ చేయటంతో.. తీర్పు అనుకూలంగా ఇచ్చింది.

ఇదీ చూడండి: హాంకాంగ్​​లో తొలిసారి బలగాలను మోహరించిన చైనా

AP Video Delivery Log - 2300 GMT News
Saturday, 16 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2225: Cuba Havana Anniversary AP Clients Only 4240289
Havana marks 500th anniversary amid economic woes
AP-APTN-2136: France Clashes AP Clients Only 4240288
Protesters attack cars and shops in Paris
AP-APTN-2114: Venezuela Guaido Speech AP Clients Only 4240287
Venezuela's Guaido calls for new protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 17, 2019, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.