ETV Bharat / international

30వేల మంది అమ్మాయిలను మోసగించిన జపాన్ కుబేరుడు! - Japan billionaire cancels hunt for lunar love

జపాన్​లో ఓ​ కుబేరుడు.. చందమామపైకి తీసుకెళ్తానని చెప్పి 30 వేల మంది అమ్మాయిలకు నిరాశ మిగిల్చాడు. ఓ వెబ్​సైట్​ ద్వారా గర్ల్​ఫ్రెండ్​ను ఎన్నిక చేసుకుంటానని గతంలో ప్రకటించి.. ఇప్పుడు మరో మార్గంలో తన ప్రేయసిని వెతుక్కుంటున్నట్లు తెలిపారు ఆ డబ్బున్న దొరబాబు.

Moonstruck: Japan billionaire cancels hunt for lunar love
30వేల మంది అమ్మాయిలను మోసగించిన జపాన్ కుబేరుడు!
author img

By

Published : Jan 30, 2020, 4:37 PM IST

Updated : Feb 28, 2020, 1:17 PM IST

జపాన్ దిగ్గజ వ్యాపారవేత్త యుసాకు మయిజావా.. గర్ల్​ఫ్రెండ్ ​కావాలంటూ విడుదల చేసిన ప్రకటనకు సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. కానీ, ఆకస్మాత్తుగా అప్లికేషన్​ ద్వారా గర్ల్​ఫ్రెండ్​ ఎంపికను ఆపేసి ఓ టీవీ కార్యక్రమంలో స్వయంవరానికి సిద్ధమయ్యాడు ఈ కుబేరుడు.

అలా ఆశలు చిగురించాయి..

స్పేస్​ ఎక్స్​ ద్వారా చంద్రుడిని చుట్టి రావడానికి ఎంపికైన తొలి ప్రైవేట్​ వ్యక్తి యుసాకు మయిజావా. ఈ జపాన్​ బిలియనీర్​.. తనకో గర్ల్​ఫ్రెండ్ కావాలంటూ ఆన్​లైన్​లో ప్రకటన ఇచ్చారు. తనతో కలిసి 2023లో స్పేస్​ ఎక్స్​ ద్వారా చంద్రయానం చేసేందుకు ఆ 'గర్ల్​ఫ్రెండ్'​ సిద్ధంగా ఉండాలని దిగ్గజ వ్యాపారవేత్త స్పష్టం చేశారు.

జపాన్​కు చెందిన ఓ నటితో విడిపోయినట్టు ఇటీవలే ప్రకటించారు యుసాకు. 44ఏళ్ల వయసులో ఒంటరితనం భరించలేకపోతున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ నెల ఆరంభంలో ప్రకటించారు.

Moonstruck: Japan billionaire cancels hunt for lunar love
30వేల మంది అమ్మాయిలను మోసగించిన జపాన్ కుబేరుడు!

"నాకు ఇప్పుడు 44ఏళ్లు. ఒంటరితనం, ఏదో కోల్పోయిన భావనలు నన్ను వెంటాడుతున్నాయి. వీటిల్లో నేను కూరుకుపోకుండా ఉండాలంటే.. ఒక మహిళను ప్రేమించడం కొనసాగిస్తూ ఉండాలి." అనే ఈ ప్రకటనతో పాటు.. 'చంద్రుడిపై ప్రయాణించే తొలి మహిళ మీరే ఎందుకు కాకూడదు?' అంటూ అప్పట్లో ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేశారు.

మరిప్పుడు...

అలా ఆశలు చిగురింపజేసి.. వేలాదిమంది అమ్మాయిలకు నిరాశే మిగిల్చారు యుసాకు. ఇప్పుడు కొత్తగా ఓ టీవీ షో ఏర్పాటు చేసి.. ఆ కార్యక్రమానికి వచ్చినవారిలో అందరిని పరిశీలించి.. తనకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకుంటానని ప్రకటించారు.

'నిజంగా, నిజాయితీగా టీవీ షో నిర్ణయం తీసుకున్నాను. కానీ, అందులో నా భాగస్వామ్యంపై మిశ్రమ ఆలోచనలు ఉన్నాయి. 27,722 మహిళలు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి నా కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందుకు నేను పశ్చాతాప పడుతున్నాను. '

-యుసాకు తాజా ట్వీట్​

ప్రచార విన్యాసాలకు కేరాఫ్​..

ఆన్​లైన్​ ఫ్యాషన్​ కంపెనీ జోజో మాజీ చీఫ్​ యుసాకు.. గతేడాది తన సంస్థను యాహూకు అమ్మేసారు. ఇప్పటి వరకు ఇద్దరితో సహజీవనం చేశారు. ఆయనకు ముగ్గురు సంతానం. ట్విట్టర్‌లో ప్రజలకు నగదును అందిస్తానంటూ అనేక రకాలుగా ప్రచార విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు యుసాకు.

ఇదీ చదవండి:సూర్యుడి సరికొత్త ఫొటోస్​​- నెటిజన్ల కామెంట్స్​ అదుర్స్

Intro:Body:

Transgenders in Jalna build an equipped home worth Rs. 1 Crore, inauguration to take place on January 30

Conclusion:
Last Updated : Feb 28, 2020, 1:17 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.