ETV Bharat / international

టెలికాం సంస్థకు చుక్కలు.. 24వేల సార్లు ఫోన్​లో ఫిర్యాదు​​

author img

By

Published : Dec 3, 2019, 2:42 PM IST

జపాన్​లో ఓ టెలికాం సంస్థ 71 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసింది. ముందు ఒకటి చెప్పి తరువాత మాట మార్చింది. సదరు కంపెనీ సర్వీసులు ఆ పెద్దాయనకు నచ్చలేదు. కోపంతో ఊగిపోయిన ఆయన.. కంపెనీ కస్టమర్​ సర్వీస్ సెంటర్​కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేశాడు. ఒకటి, రెండు కాదు... ఏకంగా 24 వేల సార్లు!

Japanese man, 71, arrested for 'making 24,000 complaint calls' in tokyo
టెలికాం సంస్థకు చుక్కలు.. 24 వేల సార్లు ఫోన్​లో ఫిర్యాదు​! ​

జపాన్​ టోక్యోలో ఓ టెలికాం సంస్థకు చుక్కలు చూపించిన ఓ వృద్ధుడిని అరెస్ట్​ చేశారు పోలీసులు. సేవలు​ నచ్చలేదంటూ కస్టమర్​ కేర్​ సెంటర్​కు 24 వేల సార్లు ఫోన్​లు చేసి ఫిర్యాదు చేసిన అకిటోషి-ఒకమాటోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జపాన్​లో ప్రముఖ టెలీ కంపెనీ కేడీడీఐకి, 71 ఏళ్ల అకిటోషికీ మధ్య వివాదం నెలకొంది. తనతో ఆరంభంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేడీడీఐ ఉల్లంఘించిందంటూ ఆరోపించాడు ఆ పెద్దాయన. వారి సేవలు తనకు ముందు చెప్పిన విధంగా లేవంటూ కస్టమర్​ సర్వీస్ సెంటర్​కు ఫోన్లు చేయడం ప్రారంభించాడు.

8 రోజుల్లోనే కొన్ని వందల సార్లు ఫోన్లు చేశాడు. అదే పనిగా విసిగిస్తున్నాడని ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో ఆయన వేరు వేరు ఫోన్​లలో నుంచి సుమారు 24 వేల సార్లు ఫోన్లు చేశాడని తేలింది. అందుకే.. అకిటోషిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

అయితే.. అకిటోషి మాత్రం ఆ సంస్థ చేసింది తప్పు కాబట్టే నేను అలా చేశానని.. ఆ కంపెనీ సిబ్బంది నాకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్​ చేస్తున్నాడు.

ఇదీ చదవండి:త్వరలో నెటిజన్ల ముందుకు 'క్వీన్' జయలలిత

New Delhi, Dec 03 (ANI): On being asked on rape and murder of woman veterinarian in Telangana, BJP MP from Mathura, Hema Malini said, "Everyday we are hearing these things happening to women, women being harassed. My suggestion is to keep the culprits in jail permanently, once they go in jail they should not be released at all."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.