కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో చైనాలోని భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26న జరగాల్సిన గణతంత్ర దినోత్సవాల కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు.. బీజింగ్‌లోని రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో ఎక్కువ మంది గుమికూడరాదంటూ చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో గణతంత్ర వేడుకలకు దూరంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం నిర్ణయించింది. చైనా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది.
ఇదీ చదవండి: రాజకీయాలకు అతీతం.. దేశ రక్షణే సర్వస్వం