భారత సైన్యాధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు ముకుంద్ నరవాణే. పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఆపకపోతే ముందస్తు దాడి చేసేందుకు తమకు హక్కు ఉందని హెచ్చరించారు. తాజాగా ఈ వ్యాఖ్యలను పాకిస్థాన్ తోసిపుచ్చింది. నరవాణే మాటలు బాధ్యతా రహితంగా ఉన్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.
"భారత నూతన సైన్యాధ్యక్షుడి ప్రకటనను మేం వ్యతిరేకిస్తున్నాం. నియంత్రణ రేఖ వెంబడి ముందస్తు దాడులు చేపట్టేందుకు భారత్‌కు హక్కు ఉందన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. భారత్ నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం. బాలాకోట్ ఘటన అనంతరం పాక్ ప్రతిఘటించిన తీరును ప్రపంచం మరచిపోదు."
-పాక్ విదేశాంగ శాఖ ప్రకటన.
భారత్ రెచ్చగొడుతున్నప్పటికీ... శాంతి-భద్రతలను ప్రోత్సహించడానికి తమ దేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పాక్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఎలాంటి సవాలుకైనా సై: సైన్యాధిపతి నరవాణే