పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. ముషారఫ్ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ముషారఫ్‌పై నమోదు చేసిన దేశద్రోహం కేసు చట్టనిబంధనల ప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
2013 డిసెంబరులో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆరేళ్ల పాటు విచారణ కొనసాగింది. డిసెంబరు 17న ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లిన ముషారఫ్‌కు లాహోర్ కోర్టులో ఉపశమనం లభించింది.
ఇదీ చూడండి: 'త్వరలో భారీ విస్ఫోటం.. భయాందోళనలో ప్రజలు'