ETV Bharat / international

'ముషారఫ్​ శరీరాన్ని 3 రోజులు వేలాడదీయండి' - ముషారఫ్​

రాజద్రోహం కేసులో పాకిస్థాన్ మాజీ సైన్యాధ్యక్షుడు ముషారఫ్​కు ఆ దేశ​ ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్ష తీర్పులో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. ఒకవేళ ముషారఫ్​ మరణిస్తే ఆయన శరీరాన్ని మూడు రోజులపాటు ఇస్లామాబాద్​లో వేలాడదీయాలని కోర్టు స్పష్టం చేసింది.

Drag Musharraf's body to central square in Islamabad, hang for 3 days: Pak court
ముషారఫ్​ చనిపోతే 3 రోజులు శవాన్ని వేలాడదీయండి
author img

By

Published : Dec 19, 2019, 7:38 PM IST

పాకిస్థాన్​ మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్​కు ఉరిశిక్ష విధించిన ఆ దేశ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పులో ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. శిక్ష అమలుచేసేలోపు గనక ముషారఫ్​ మృతి చెందినట్లయితే అతని శరీరాన్ని ఇస్లామాబాద్​లోని సెంట్రల్ స్క్వేర్​ వద్దకు ఈడ్చుకొచ్చి మూడు రోజులపాటు అక్కడ వేలాడదీయాలని విస్తుపోయే తీర్పునిచ్చింది.

167 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించిన పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వకార్ అహ్మద్ సేత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం... ముషారఫ్​కు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని కూలదోయడం సహా రాజద్రోహం కేసులో ముషారఫ్​కు శిక్ష ఖరారు చేసింది. మరణశిక్ష అమలు కంటే ముందే ముషారఫ్‌ చనిపోతే ఏం చేయాలో కూడా చెప్పింది.

"దోషిని(పర్వేజ్​ ముషారఫ్​) నిర్బంధించడానికి అన్ని విధాల ప్రయత్నించాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాం. ఒకవేళ శిక్ష అమలు చేయడానికి ముందే చనిపోతే అతని శరీరాన్ని డీ-చౌక్(ఇస్లామాబాద్, పాకిస్థాన్) వద్దకు లాక్కొచ్చి మూడు రోజులపాటు వేలాడదీయండి."-వకార్ అహ్మద్ సేత్, పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

అయితే మరణశిక్ష విధిస్తూ వెలువడిన తీర్పును ఆ దేశ మిలిటరీ ఇదివరకే కొట్టి పారేసింది. మరణశిక్ష విధించిన నాటినుంచి పర్వేజ్‌ మద్దతుదారులు దేశమంతా చిన్న స్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా తన వెనుక నిలిచిన పాక్‌ ప్రజలకు, సాయుధ బలగాలకు ముషారఫ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన భవిష్యత్తును గురించి తన లాయర్లను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. మరోవైపు, మరణశిక్ష అనంతరం తలెత్తే పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొవాలనే విషయంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కొంత సేపటి క్రితం తన సలహాదారులతో చర్చించారు.

ఇదీ చదవండి: వ్యక్తిగత కక్షతోనే మరణ శిక్ష: ముషారఫ్​

ఇదీ చదవండి: మాజీ సైన్యాధిపతికి మరణ శిక్ష- పాక్​ చరిత్రలో తొలిసారి

New Delhi, Dec 19 (ANI): Bharti Airtel has suspended voice, SMS and data in certain areas of Delhi after receiving instructions from government authorities. Several protesters have gathered in and around Delhi to protest against Citizenship (Amendment) Act 2019 despite imposition of Section 144 in several areas. Security has been beefed up in these areas.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.