ప్రపంచ దేశాలను చైనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ ఇప్పటికే 17మందిని బలితీసుకుంది. బుధవారం నాటికి వైరస్ సంబంధిత లక్షణాలతో 543 కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అమెరికా, హాంగ్‌కాంగ్, మెక్సికో దేశాల్లో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
వుహాన్ నగరం ఈ వైరస్‌కు కేంద్ర బిందువుగా మారింది. చైనాలో నూతన సంవత్సర వేడుకలు, సెలవుల నేపథ్యంలో చైనాను విడిచివెళ్లవద్దని నగరవాసులకు సూచనలు చేసింది ప్రభుత్వం. ప్రాణాంతక వైరస్‌తో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర సమావేశం జరిపింది. ఈ వైరస్‌ను ప్రపంచవ్యాప్త ఆరోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటించే అంశంపై చర్చలు జరిపింది.
ఇదీ చూడండి: వణికిస్తున్న రాకాసి వైరస్- దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనూ పరీక్షలు