హాంకాంగ్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. చైనా నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ వేల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్డెక్కారు. వారిని నియంత్రించేందుకు బలగాలు యత్నించడం వల్ల పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఆందోళనకారులపైకి పోలీసులు బాష్పవాయువు గోళాలు, రబ్బరు తూటాలు, జల ఫిరంగులను ప్రయోగించారు. కొన్నిచోట్ల నిరసకారులు.. పోలీసులపైకి రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరారు. మరోవైపు హాంకాంగ్ నిరసనకారులకు మద్దతుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ, తైవాన్ రాజధాని తైపీలో వేలమంది ర్యాలీలు నిర్వహించారు.