టెలికాం రంగంలో చైనా జోరు పెంచింది. 6జీ సెల్యులర్ సర్వీసులపై అధికారికంగా పరిశోధన ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సూపర్‌ఫాస్ట్ 5జీ సేవలను ప్రారంభించిన కొద్దిరోజులకే ఈ చర్యను చేపట్టడం గమనార్హం.
ప్రపంచ శక్తిగా ఎదగాలని..
కొత్తతరం టెలికాం పరిజ్ఞానం విషయంలో అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని తోసిరాజని ప్రపంచ శక్తిగా ఎదగాలన్నదే చైనా లక్ష్యం. 6జీపై పరిశోధనల కోసం రెండు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు చైనా శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా 6జీ సాంకేతిక పరిజ్ఞానంపై ఇంకా అస్పష్టత ఉంది. దాన్నెలా ఉపయోగించాలనే దానిపై ఏకాభిప్రాయం లేదని చైనా శాస్త్ర, సాంకేతిక శాఖ ఉప మంత్రి వాంగ్ షి చెప్పారు. చైనా గత నెల 31న 5జీ సర్వీసులను ప్రారంభించింది.
డ్రైవరు అవసరం లేని కార్లకు..
6జీ డౌన్‌లోడ్ వేగం ప్రస్తుత 4జీ కన్నా 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డ్రైవర్ అవసరంలేని కార్లు, కృత్రిమ మేధస్సుతో నడిచే ఇతర సాధనాలకు ఇది ప్రయోజనకరం. దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ కూడా ఈ ఏడాది 5జీ సేవలను ప్రారంభించాయి.
ఇదీ చదవండి:నిద్ర సరిగా పట్టడం లేదా? ఇది మీకోసమే..