బంగ్లాదేశ్లో రెండు రైళ్లు ఢీకొని 15 మంది మృతి చెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రహ్మాన్బరియా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉదయాన్ ఎక్స్ప్రెస్- తుర్ణా నిషితా రైళ్లు మోండోభాగ్ రైల్వేస్టేషన్లో ఢీకొన్నాయి. మృతుల్లో 12 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. రైలు పెట్టెల కింద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
లోకో పైలట్లు సిగ్నల్స్ నియమాలను పాటించనందుకే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. మూడు వేర్వేరు దర్యాప్తు కమిటీలు ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణను ప్రారంభించాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : హృతిక్ను అభిమానించినందుకు భార్యను చంపిన భర్త!