ETV Bharat / international

కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు - అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి

చైనాలో కరోనా మృతుల సంఖ్య 212కు చేరింది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు డబ్ల్యూహెచ్​ఓ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇది చైనాకు వ్యతిరేకంగా తీసుకున్న చర్య మాత్రం కాదని స్పష్టం చేసింది. సరైన వైద్య సదుపాయాలు లేని దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడం కోసమే ఈ ఎమర్జెన్సీ విధించినట్లు పేర్కొంది.

WHO declares international emergency over novel coronavirus
కరోనా: అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Jan 31, 2020, 5:27 AM IST

Updated : Feb 28, 2020, 2:52 PM IST

కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.​ చాలా అరుదైన సందర్భాల్లోనే ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తుంటారు. దీని వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో దేశాల మధ్య మంచి సమన్వయం సాధించడానికి వీలవుతుంది. అటు చైనాలో కరోనా మృతుల సంఖ్య 212కు చేరినట్లు అధికారులు తెలిపారు.

"బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశముంది. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాం."- టెడ్రోస్ అధనామ్​ ఘెబ్రేయేసస్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​

చైనాకు వ్యతిరేకంగా కాదు

అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించడం అనేది... చైనాపై విశ్వాసం లేకపోవడం కానేకాదని టెడ్రోస్ నొక్కి చెప్పారు. కేవలం ఆరోగ్య వ్యవస్థలు సరిగా లేని దేశాలకు సహాయం చేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. కరోనాను అరికట్టేందుకు చైనా తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు.

కలిసి పోరాడుదాం

ఈ వారం చైనాలో పర్యటించిన టెడ్రోస్​.. ఆ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​తో భేటీ అయ్యారు. కరోనా వ్యాప్తిని అదుపుచేసేందుకు కలిసి పనిచేద్దామని కోరారు.

ఇటీవల అంతర్జాతీయ వాణిజ్యంపై పరిమితులు విధిస్తుండడం, విమానసేవలు నిలిపివేయడం, సరిహద్దు మూసివేతలకు తోడు ఆరోగ్యవంతులైన ప్రయాణికులను అడ్డుకోవడంపై టెడ్రోస్ స్పందించారు. ఇది ఆయా దేశాల ఆర్థికవ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిర్దిష్ట పరిమితుల వరకే నిర్బంధం ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 30వేల మంది అమ్మాయిలను మోసగించిన జపాన్ కుబేరుడు!

ZCZC
PRI ESPL NAT NRG
.NEWDELHI DES37
DL-POLLS-BJP-CLINICS
BJP targets AAP, says Mohalla Clinics lack even basic facilities
         New Delhi, Jan 30 (PTI) Seeking to corner the ruling AAP over its claims of revolutionising education and healthcare in Delhi, the BJP has come out with a video of the Mohalla Clinics.
         With voting for assembly polls on February 8, just a week ahead, the BJP released the video on Thursday targeting Kejriwal government's flagship scheme.
         The video was tweeted by the BJP president JP Nadda.
         "Kejriwalji, you promised to open 1,000 mohalla clinics every year. Whatever small number of clinics you opened lack even the basic facilities, Nadda tweeted.
         The video sought to establish a lack of basic facilities at the Mohalla Clinics.
         The tweet by Nadda was also retweeted by Union Home Minister Amit Shah saying that the video exposed "healthcare revolution" of Kejriwal government.
         Shah earlier said the "education revolution" claimed by Kejriwal government was exposed by a visit of Delhi government schools by party MPs.
         The seven Lok Sabha MPs in Delhi and Rajya Sabha MP Vijay Goel had recently visited Delhi government schools in different parts of the city, alleging lack of basic facilities there.
         "After education, now the health revolution of Kejriwal government has been exposed. Will Delhi's poor get their operation done here? For the sake of your selfish politics, you kept Delhi's poor away from Modi ji's Ayushman Yojana. You have to give answers for the sin that you have committed," Shah tweeted. PTI VIT VIT
ABH
ABH
01302215
NNNN
Last Updated : Feb 28, 2020, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.